తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అనుదీప్ కె.వి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుదీప్ కే వి "జాతి రత్నాలు" మూవీ కి దర్శకత్వం వహించి ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని ,  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనుదీప్ కే వి తాజాగా తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే మూవీ ని తెరకెక్కించాడు.

మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు ,  ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ,  ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ కి థియేట్రికల్ ,  నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలిపి దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తెలుగు లో ఈ మూవీ కి 10 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకొని ,  ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే ఈ మూవీ విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ పై తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: