ఇప్పటికే  సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ సెలబ్రెటీలు తాము ఎంతగానో ప్రేమించిన అబ్బాయిలను అమ్మాయిలను, అలాగే ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధాలను చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.అంతేకాదు కొంతమందైతే పెళ్లి చేసుకోవడమే లేటు గుడ్ న్యూస్ కూడా చెబుతూ ఫాన్స్ ని మరింత సర్ప్రైస్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు మహానటి కీర్తి సురేష్.ఇక  చూడడానికి తెలుగమ్మాయిలగా, కుందనపు బొమ్మ లా ఉండే కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అంతేకాదు ఈమె ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి తగ్గట్టు అందులో లీనమైపోయి నటిస్తుంది. ఇక ఆమె చేసే పాత్ర ట్రెడిషనల్ అయినా మోడరన్ అయినా సరే అచ్చుగుద్దినట్టు ఆ పాత్రలోకి లీనమై ఒదిగిపోతుంది. అయితే అందుకే తెలుగులో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది కీర్తిసురేష్.ఇకపోతే  కేవలం ఈ ఒక్క టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.  కీర్తి సురేష్ పేరు చెబితే చాలు అందరి మొహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఇక మహానటి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని అందరికీ మహానటిగా గుర్తుండిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా రోజులు హద్దుల్లో ఉండి ఒక సౌందర్య లాగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పర్ఫామెన్స్ చేసింది. ఈ మధ్యనే కొంచెం లిమిట్స్ దాటి గ్లామర్ ఒలకబోస్తుంది.

ఈ విషయం పక్కన పెడితే ఓ వారం రోజుల నుండి కీర్తిసురేష్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ తల్లి మేనక తమిళ్ మీడియాకు అసలు విషయం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే  వాస్తవానికి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాల నుండి వెంట పడుతుందట.  కీర్తి మాత్రం జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటా అంటూ ఆ విషయాన్ని దాటేస్తూ వస్తుందట. కీర్తి సురేష్ కి పెళ్ళికొడుకు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడని, ఆ అబ్బాయి ఎవరో కాదు మా దగ్గరి బంధువే, అతనితోనే మా కూతురు పెళ్లి జరుగుతుంది అని,కీర్తి ఈరోజు పెళ్లి కి ఓకే చెబితే రేపే పెళ్లి చేస్తామంటూ కీర్తి సురేష్ తల్లి కోలీవుడ్ మీడియాకు చెప్పినట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అవడంతో ఆ అబ్బాయి ఎవరా అని చాలా మంది ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: