టాలీవుడ్ లో బిజీగా ఉండే యాంకర్లలో శ్యామల కూడా ఒకరు. యాంకర్ శ్యామల పలు టీవీ షో లతోపాటు ఆడియో ఫంక్షన్ లు, సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా వ్యవహరిస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకుందట.

కేవలం యాంకర్ గానే కాకుండా శ్యామల సినిమాల్లోనూ నటిస్తున్నారు. మరో వైపు జబర్దస్త్ టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చి జెన్యూన్ గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది. శ్యామల గతంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఓ సీజన్ లో ఓసారి ఎలిమినేట్ అయ్యి మరోసారి అభిమానుల రిక్వెస్ట్ తో రీఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగు పెట్టారు. అలా జరగటం బిగ్ బాస్ తెలుగులో మొదటి సారి.

ఇదిలా ఉంటే గతంలో ఓ హీరోయిన్ టాలీవుడ్ సెలబ్రిటీలను అమెరికాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి పిలిచి వారికి ఇష్టం లేకున్నా వ్యభిచారం చేయిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసిందట m. ఈ విషయంపై మరియు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై శ్యామల ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. గతంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు అలాంటి ఘటనలు మీకు ఏమైనా ? ఎదురయ్యాయా .. మీకు ఎవరైనా ఫోన్ చేశారా..? అని యాంకర్ ప్రశ్నించారట.

దానికి శ్యామల సమాధానం ఇస్తూ. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫోన్ లు వాడను.. లోకల్ నంబర్ లు తీసుకోను.. నాకైతే అలాంటి ఫోన్ లు ఇప్పటివరకు రాలేదు. నేను వెళ్ళినవి అన్ని ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్.. అలాంటి ఆర్గనైజేషన్ లో ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటారట.కాబట్టి వారికి భయం ఉంటుంది. అమెరికాకు ఎలా వచ్చామో అంతే జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నేను ఎప్పుడూ హోటల్ లో ఉండలేదు.. మాది పెద్ద ఫ్యామిలీ అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మా చుట్టాలు ఉన్నారని తెలిపింది.

అలా తాను అమెరికా వెళ్ళినప్పుడు హోటల్స్ లో స్టే చేయలేదు. నేను వెళ్ళింది.. ఉన్నది అంతా మా చుట్టాల ఇంట్లోనే, ఒకసారి మాత్రం ఈటీవీ వాళ్ళతో వెళ్లినప్పుడు హోటల్లో ఉన్నాము. అప్పుడు వచ్చిన వాళ్లంతా అదే హోటల్లో ఉన్నారు. ఈటీవీ వాళ్ళతో వెళితే గవర్నమెంట్ హాస్టల్ లో ఉన్నట్టుంటుంది. సరదాగా బయటకు వెళదామన్నా మేము కూడా తోడుగా వస్తామని చెబుతారు. అంటూ అమెరికా సెక్స్ రాకెట్ పై శ్యామల కామెంట్ కూడా చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: