బాలీవుడ్ లో ప్ర‌క‌ట‌న లేమీ లేకుండా పెళ్లి పీట‌లెక్కే సంప్ర‌దా యాలు కొన‌సాగుతూ ఉన్నాయి. గ‌త కొన్నే ళ్ల‌లో ప‌లువురు హీరో-హీరోయి న్లు పెళ్లిళ్లు చేసుకుని దాంప‌త్యం లోకి అడుగు పెట్టాయి. ప్రేమికు లుగా వీరు హ‌డా వుడి చేశారు మొద‌ట‌. బాహాటం గా చ‌ట్టా pప‌ట్టా లేసుకు తిరిగారు. అయితే పెళ్లి గురించి మాత్రం ఎలాంటి లాంఛ‌న ప్ర‌క‌ట‌న కూడా చేయ ‌లేదు! కామ్ గా పెళ్లికి ఏర్పాటు చేసు కోవ‌డం, బాగా కావాల్సిన వారిని ఆ వేడుక‌కు పిలుచు కోవ‌డం, పెళ్లి చేసేసుకోవ‌డం! ఈ త‌ర‌హా కొన‌ సాగుతూ ఉంది. తాము పెళ్లి చేసు కోబోతున్న‌ట్టు గా ఏ సోష‌ల్ మీడియా లో కూడా చెప్ప‌ కుండానే బాలీవుడ్ హీరో హీరోయిన్లు పెళ్లి పీట‌లెక్కేస్తూ ఉన్నారు. మ‌రి ఈ క్ర‌మం లోనే మ‌రో జంట దాంప‌త్య జీవ‌నం లోకి అడుగుపెట్ట‌బో తోంద‌నే టాక్ వినిపి స్తోందిప్పుడు.

ఈ సారి మ‌రెవరో కాదు..కియ‌రా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. వీరిద్ద‌రూ ప్రేమికులుగా ఇప్ప‌టికే కావాల్సినంత ప్ర‌చారం పొందారు. క‌లిసి నటిస్తూ, ప్రేమ‌ను కొన‌సాగిస్తున్న ఈ జంట‌... ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్ల‌బో తోంద‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రూ ఈ ఏడాది డిసెంబ‌ర్లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని స‌మాచారం.

ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లు జ‌రుగు తూ ఉన్నాయి. ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండా, పెద్ద‌గా హడావుడి లేకుండా ఈ జంట త‌మ వివాహానికి ఏర్పాట్లు చేయించుకుంటోంద‌ట‌. కావాల్సిన వారిని పిలుచుకుని ఈ ఏడాది డిసెంబ‌ ర్లోనే వీరు పెళ్లి చేసుకో బో తున్న‌ట్టుగా రూమ‌ర్లు వినిపిస్తు న్నాయి.

విశేషం ఏమిటంటే..ఇలాంటి రూమ‌ర్లే ఇటీవ‌ల నిజం అయ్యాయి. క‌త్రినాకైఫ్- విక్కీ కౌశ‌ల్, అలియాభ‌ట్ -ర‌ణ్ బీర్ క‌పూర్ ల వివాహాలు ఇలానే జ‌రిగాయి. మ‌రి ఆ ప‌రంప‌ర‌ లో సిద్ధార్థ్- కియ‌రాల పెళ్లి కూడా జ‌రగ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: