పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కెరియల్  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా అందరికీ గుర్తుంటే ఉంటుంది .ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన సినిమాల్లో ఒకటి.. ఇక జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే HD క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా. ఇక అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాకి వచ్చిన వసూళ్లను అందుకోవడం చాలా కష్టంగా అయ్యేది. 

కానీ ఇప్పుడు బాహుబలి సినిమా వసూళ్లు ఎలాగో అప్పట్లో మగధీర సినిమా వసూళ్లు కూడా అలా అన్నమాట. ఇక అలా మగధీర కలెక్షన్స్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ చాలా దగ్గరగా ఉండేవి. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా ఏకంగా మగధీర వసూళ్లను దాటిసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకోని స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అనడంలో ఇలాంటి సందేహం లేదు. అయితే ఈ బ్లాగ్ బస్టర్ లో సినిమాని త్రివిక్రమ్ ముందుగా పవన్ కళ్యాణ్ కోసం అనుకోలేదట. ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు

అయితే బావుంటాడని ఆయన కోసం ఈ కథను సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రమ్. కానీ అప్పట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి డేట్స్ ని త్రివిక్రమ్ సినిమా కోసం ఇచ్చేశారు. దీంతో ఆ సమయంలో త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్ట్ ఉండడంతో పవన్ కళ్యాణ్ తోనే ఈ సినిమా చూశాడు త్రివిక్రమ్. బాహుబలి సినిమా వచ్చేంతవరకు అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు .అప్పుడు హీరోలకి అందరికీ హిట్ సినిమాలు పడినప్పటికీ ఆ రికార్డును మాత్రం ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: