
మొదటిసారి నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ చిత్రంలో నటించారు.యాక్షన్ సీన్స్ ట్రైన్ ఫైట్లు ఫ్లాస్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.తాజాగా ఈ సినిమా ఓటీటి లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 9 వ తేదీ నుంచి ఈ చిత్రం కాబోతున్నది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది తెలుగు ,తమిళ్, మలయాళం ,కన్నడ వంటి భాషలలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కీలకమైన పాత్రలలో అరవిందస్వామి, ప్రియమణి, శరత్ కుమార్ తదితరులు సైతం ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇళయరాజా యువన శంకర్రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని నా అక్కినేని అభిమానులు అనుకోగా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య సరైన సక్సెస్ కోసం ఒక సరైన కథని ఎంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల లో నిరాశపరిచిన కస్టడీ చిత్రం ఓటీటి లో ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందొ చూడాలి మరి.