డబ్బులు పెట్టుబడి పెట్టాలి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. ఈ పండుగ వేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు.. 2021 డిసెంబర్లో ఈక్విటీ ఆధారిత పథకాల్లో కి రూ.25,076 కోట్ల నికర పెట్టుబడి వచ్చి చేరింది.. 2021 నవంబర్లో ఈ ఖాతాల్లో రూ.11,614 కోట్ల పెట్టుబడి పెట్టగా ఒక నెలలోనే రెట్టింపు అయిపోవడం గమనార్హం. ముఖ్యంగా ఒకే ఒక నెలలో 116 శాతం ఆకట్టుకునే వృద్ధి కనిపించడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ 2021 వ సంవత్సరంలో ఎస్ఐపీ నుంచి పెట్టుబడి రూ.11,305 కోట్లకు పెరిగింది.. ముఖ్యంగా నవంబర్ 2021 నాటికి ఎస్ ఐ పి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెష్ట్ చేసే వారు ఏకంగా రూ.11,004 కోట్ల పెట్టుబడి పెట్టగా ప్రస్తుతం అది రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఎస్ ఐ పి అనే బూస్టర్ అనేది పెట్టుబడి దారులకు నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెంచుకునే అవకాశానికి కల్పించే ఒక చక్కటి సదుపాయం అని చెప్పవచ్చు.. ఇది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని మనకు కల్పిస్తుంది.. అంతేకాదు ఈ ఎస్ ఐ పి బూస్టర్ సదుపాయం ప్రారంభంలోనే మనం దరఖాస్తు చేసుకోవచ్చని గుర్తుపెట్టుకోవాలి.. అయితే ఎవరైనా సరే ఇప్పటికే ఎస్ ఐ పి పాత దానిని నడుపుతున్నట్లు అయితే బూస్టర్ సౌకర్యం కోసం వారు ఏం చేయాలి అన్నప్పుడు ఎస్.ఐ.పీపాత పద్ధతి రద్దు చేసి కొత్త దానిని ఎంచుకోవడమే మంచి పని..


ఇక ఇందులో 20 సంవత్సరాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో గనక 20 వేల రూపాయలను మనం పెట్టుబడి పెడితే ప్రస్తుతం అది 11 శాతం రాబడి కూడా వస్తుందట. ఉదాహరణకు రూ.48 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.1.75 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కూడా వస్తుంది అని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: