బ్యాంకు బ్రాంచీల ద్వారా ఈ నిబంధన అమలు చేయాలనే ఉద్దేశంతో నూతన ప్రతిపాదన చేసినట్లు ప్రస్తుతం అందుతున్న సమాచారం. అంతేకాదు ఇది ఖరారు చేస్తూ ఈ మేరకు 'డిస్కషన్ పేపర్ ఆన్ ఛార్జెస్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్స్' లో ఆర్బీఐ ప్రస్తావించడం మరొక అంశం. నగదు లావాదేవీ విలువ రూ.2 లక్షలు మించితే రూ.25 వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిపింది. ఇక మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి వున్న ఖాతాదారుల ఆన్‌లైన్ ఎన్‌ఈఎఫ్‌టీ ట్రాన్సాక్షన్స్ పై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని ఆర్బీఐ ప్రతిపాదించడం విశేషం. ఈ మేరకు డిస్కషన్ పేపర్ బుధవారం(17 ఆగస్టు 2022)న విడుదల చేస్తూ వివరాలు తెలియచేసింది.
అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా ఈ నిబంధన మొదలు కాలేదనే చెప్పాలి. ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజులు విధించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) యోచిస్తోంది. కాగా ప్రస్తుతానికి ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదు అయితే ఎప్పటి నుండి ఇది అమలులోకి రానుంది అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి