బాబూ మోహన్... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన అగ్ర కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. అగ్ర హీరోలు అందరి సినిమాల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు పక్కన ఆయన చేసిన కామెడి పాత్రలకు అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా నటించే వారు. ఆ విధంగా టాలీవుడ్ లో బాబూ మోహన్ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణా ప్రాంతం నుంచి ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టారు. 

 

ఇక అది పక్కన పెడితే ఆయన రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టారు. ఆ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎక్కువగా ప్రజల్లో ఉండే నాయకుడిగా బాబూ మోహన్ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాలో ఏ విధంగా అయితే గుర్తింపు తెచ్చుకున్నారో తెలంగాణా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పట్లో మంచి ప్రాధాన్యత ఇచ్చే వారు. 

 

అయితే 2014 ఎన్నికల ముందు తెరాస పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయనను కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అప్పట్లో. ఇక ఆ తర్వాత బాబు మోహన్ కి 2018 ఎన్నికల్లో అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన్ను పక్కన పెట్టి ఆ నియోజకవర్గం నుంచి జర్నలిస్ట్ క్రాంతి ని బరిలోకి దింపారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: