తెలుగులో అయినా సరే తమిళంలో అయినా సరే నయనతార కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నయనతార సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది తమిళంలో. ఈ మధ్య కాలంలో ఆమె సోలో గా ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తుంది. సోలో సినిమాలకు మంచి ఆదరణ ఉండటం దానికి తోడు పాత్రల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న నేపధ్యంలో ఇప్పుడు హీరోయిన్ లు అయినా దర్శకులు అయినా సరే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నయనతార ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంది అనేది వాస్తవం. ఆమె సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ఆమెకు తెలుసు. 

 

అందుకే ఆమె ఇప్పుడు ఏ ప్రయోగం చేయడానికి అయినా సరే ముందుకు వస్తుంది అనేది వాస్తవం. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది నయన్. అక్కడ ఒంటరి గా కూడా ఆమె సినిమాలు చేస్తుంది. అగ్ర హీరోల తో సినిమాలు అయితే పారితోషికం కూడా ఎక్కువగానే తీసుకుంటూ వస్తుంది ఆమె. ఇప్పుడు అక్కడ ఆమెకు ఉన్న క్రేజ్ తో ఆమె ఎంత అడిగినా సరే కాదు అనే పరిస్థితిలో దర్శక నిర్మాతలు లేరు. ఇక ఇది పక్కన పెడితే ఆమెకు తెలుగులో ఒక స్టార్ హీరో తో ఆఫర్ వచ్చింది. 

 

ఆ సినిమాను ఆమె చేస్తే సినిమా  లో కొంత షేర్ కూడా ఇస్తామని చెప్పారట. అయితే అది తమిళ హీరో తో చేసే సినిమా ప్రచార బాధ్యతలతో పాటు కొన్ని బాధ్యతలను నయనతార చూసుకోవాలి. అయితే ఆమె మాత్రం చాలు ఘాటుగా సమాధానం చెప్పి తాను సినిమా చేయడం లేదని తనకు అంత అవసర౦ లేదని మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె తమిళంలో చాలా ఆలోచించి సినిమాలు చేస్తుంది గాని ఇతర భాషల మీద దృష్టి పెట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: