శ్రీదేవి..ఇది నిన్నటి తరం యూత్ కి ఒక ఎమోషన్. ఆమె పేరు చెప్తే ఒక్క అభిమానులే కాదు సినిమా హీరోలు సైతం పడి చచ్చిపోయేవారు. ఈ రోజు మన మధ్యన లేకపోయినా, శ్రీదేవి ఎంతో మందికి ఆరాధ్య దేవత. ఆమె కోసం దర్శకులు క్యూ కట్టేవారు. నిర్మాతలు, హీరోలు నిద్ర లేని రాత్రులు గడిపేవారు. ఆమె డేట్స్ ఇచ్చిందట అది పెద్ద పండగ. తెలుగులో పెద్ద హీరోలు సైతం శ్రీదేవి తో ఒక్క సినిమా చేయాలనీ ఆరాటపడ్డవాళ్లే. బాలనటిగా సినిమా ప్రయాణం మొదలు పెట్టి , భారత దేశం లో అన్ని భాషలకు తన మార్కు ప్రతిభ చూపించింది. తెలుగు లో సైతం ఎన్టీఆర్ కి మనవరాలిగా, ప్రియురాలిగా అలరించింది.

ఇక అస్సలు విషయానికి వస్తే శ్రీదేవి తల్లికి ముగ్గురు సంతానం. కానీ ఆమె తండ్రి అయ్యప్పన్ కి మాత్రం  మొదటి భార్య తో వేరే సంతానం ఉండగా శ్రీదేవి తల్లితో ఇద్దరు కూతుళ్లు మాత్రమే. ఇక శ్రీదేవి అక్క మాత్రం తన తండ్రి అయ్యప్పన్ కి పుట్టలేదు. ఆమె శ్రీదేవి తల్లి అయిన రాజేశ్వరికి మొదటి భర్త నుండి పుట్టిన సంతానం. ఇక్కడ శ్రీదేవి గొప్పతనం మెచ్చుకోక తప్పదు. ఆమె తన తండ్రికి కూతురు కాకపోయినా అక్కను ఎంతగానో అభిమానించింది. అక్క కూతురు అయిన మహేశ్వరిని ఇండస్ట్రీ కి తెచ్చింది. మహేశ్వరీ తమ్ముడు సైతం హీరోనే. ఇక చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ మొదటి భార్య కొడుకు అయిన సతీష్ అనే వ్యక్తిని సైతం సినిమా ఇండస్ట్రీ కి చాల ఏళ్ళ క్రితమే పరిచయం చేసింది. కానీ దురదృష్ట వశాత్తు సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో ఒక ప్రమాదానికి గురయ్యి ఆయన కన్నుమూశారు. ఇలా తన తమ్ముడిని శ్రీదేవి కోల్పోయింది. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మీడియా వారు ఫోకస్ చేసారు. కానీ శ్రీదేవి ఏ రోజు తన కుటుంబం గురించి ఎక్కడ మాట్లాకపోయిన వారికీ మాత్రం ఉన్నన్ని రోజులు ఎంతో సేవ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: