టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల వైపే మొగ్గు చూపుతున్నారు.. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండ్రస్టీల్లోనూ తమ సత్తా చాటాలనుకుంటున్నారు..అదే రూట్ లో వెళ్తున్నాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇక బేసిగ్గా బన్నీ తెలుగుతో పాటు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు బన్నీ తన రేంజ్‌ను ప్యాన్ ఇండియాకు పెంచుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే సుకుమార్‌తో కలిసి పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు బన్నీ చేయనటువంటి ఓ మాస్ రోల్‌లో ప్రెజంట్ చేస్తున్నాడు సుకుమార్.

రీసెంట్‌గా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ పుష్ప గురించి మరింత ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశాడు. ప్రపంచంలో శేషాచల అడవుల్లోనే ఎర్ర చందనం దొరుకుతుంది. ఈ ఎర్రచందనంను స్మగ్లింగ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం చైనా, జపాన్ వంటి విదేశాలకు ఎగుమతి అయ్యిందట.దీనిపై సినిమా రన్ అవుతుందట. ఇంత పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరిగే పాయింట్ మీద సుకుమార్ ఈ కథను ప్రిపేర్ చేసుకున్నాడు. రీసెర్చ్ చేసే క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చాలా విషయాలు తెలిశాయట.

వీటిని బేస్ చేసుకుని ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడు. కానీ..చివరకు అది సినిమాగా రూపొందుతుందని సుకుమార్ తెలియజేశాడు.రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లనున్నట్లు తెలుస్తోంది..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: