సినీ వారసత్వంగా వచ్చిన ఆ హీరో తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవటమే కాకుండా తనతో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వారి సంసారంలో ఆ తరువాత కాలంలో ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు అటు వైపు ఇటు వైపు వారు కూడా ప్రయత్నాలు గట్టిగా చేసినా కానీ వారే ససేమిరా కలిసేది లేదని తెగేసి చెబుతున్నారు. కారణాలేవైనా వారు ఆలా విడిపోవటం అందర్నీ బాధకు గురిచేసింది. కాగా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా అతను కూడా విభిన్న కథాంశాలున్న సినిమాలతో తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలోనే హీరోకు చాలా మంది హీరోయిన్లు సైట్ కొడుతూ సహజీవనం చేద్దామనే ఆఫర్ కూడా ఇస్తున్నారు.

అయితే అతడు లొంగడం లేదు అతనికి బ్యాచిలర్ లైఫే బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు. ఆడదాన్ని కట్టుకుంటే అన్ని కష్టాలే అన్న వేదాంతంలోకి వెళ్లిపోయాడు. ఆమె కూడా మరో వివాహం చేసుకోవాలనే ప్రతిపాదన తేవడం లేదు. దీంతో ఇద్దరు మోడు వారిన చెట్లలా ఉండిపోతున్నారు. తమ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న వారిలో రావడం లేదు. ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటాం అనే కోణంలో మాట్లాడుతున్నారు. అతడికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తనదైన శైలిలో సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. వివాహ బంధంలోని మజాను వారు ఎంజాయ్ చేయలేదని తెలుస్తోంది. అందుకే విడాకులు తీసుకుని వేరై పోయినట్లు తెలుస్తోంది.

ఒక ఒంటరిగా ఉండాలనే ఇద్దరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల చొరవతోనైనా కలుస్తారేమోనని అనుకున్నా అది కూడా కుదరలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. సంసారమనే నావను సజావుగా నడిపే సత్తా లేకే ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వారెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది కదూ. రాబోయే కాలంలో వారు మళ్లీ కలుసుకుని సంసారం చేయాలని అందరు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: