నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు నాని.ఇదిలావుంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి పూర్తిస్థాయిలో మారిపోయింది.అంతేకాక  యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.ఇకపోతే నాని నటించిన అంటే సుందరానికి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.

కాగా  ఈ సినిమాకు నాని 15 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.ఇదిలావుంటే  వరుస సినిమాలు ఫ్లాప్ అవుతుండటం, దసరా సినిమాకు బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో నాని తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంద.అయితే ఎంతమేర తగ్గించారో క్లారిటీ లేకపోయినా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు నాని రెమ్యునరేషన్ ఉండవచ్చని తెలుస్తోంది.ఇక సాధారణంగా నాని రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయలు కాగా అంటే సుందరానికి బడ్జెట్ తక్కువ కావడంతో నాని రెమ్యునరేషన్ ను పెంచారు.

ఇదిలావుంటే నాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధిస్తే మాత్రమే నాని రేంజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.ఇక నానికి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నాని ఫెయిలవుతున్నారు. ఇదిలా వుండగా నాని ప్రస్తుతం దసరా సినిమాలో కీర్తి సురేష్ తో కలిసి నటిస్తుండగా 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.అయితే  నాని రేంజ్ కు ఈ బడ్జెట్ ఎక్కువే అయినా కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఇకపోతే నాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోతే నాని కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఇక నాని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మంచిదని చాలామంది సూచిస్తున్నారు. కాగా హీరో రామ్ ను నాని ఫాలో కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: