కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయిన లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజు 'మా నగరం' అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో లోకేష్ కనకరాజు కు తమిళ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ మరియు మాస్టర్ మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు.

కొంత కాలం క్రితం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి విక్రమ్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఈ మూవీ తో లోకేష్ కనకరాజు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించు కున్నాడు . ఈ మూవీ లో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , మలయాళ స్టార్ హీరో లలో ఒకరు అయిన ఫాహాద్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు . సూర్యమూవీ లో గెస్ట్ రోల్ లో నటించాడు . విక్రమ్ మూవీ తో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్న లోకేష్ కనకరాజు తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనకరాజు మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనున్ కొషియన్ అనే మూవీ తమిళంలో రీమేక్ చేయబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: