యువ హీరో నిఖిల్ ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో బాగా ఫేమస్ అయ్యారు. అందులో ముఖ్యంగా కార్తికేయ -2 చిత్రం ద్వారా తెలుగు రాష్ట్రాలలో కన్నా ఉత్తరాదిలో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక బాలీవుడ్ లో 50 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 700 థియేటర్లకు పైగా ఆడుతున్నట్లు సమాచారం. ఇక దీంతో ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పవచ్చు. కంటెంట్ బేసిక్ గానే ఆడుతున్న సినిమా కాబట్టి నిఖిల్ కు కూడా ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఊపునిస్తోంది.


ఇక హింది మార్కెట్లో కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకున్నారు నిఖిల్ తన టేస్ట్ ఎలా ఉంటుంది అనేది హిందీ అభిమానులకు ఇప్పుడు పూర్తిగా అర్థమయింది. రొటీన్ కథలకు  నిఖిల్ ఎప్పుడు దూరంగా ఉంటారని ఈ సినిమాతో ఫ్రూప్ చేసుకున్నాడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెళ్లిన ఈ స్థాయిలో సక్సెస్ అందుకోవడం అంటే అది ప్రశంసించదగ్గ విషయమే అని చెప్పవచ్చు. ఇప్పటివరకు బాలీవుడ్ లో  సక్సెస్ అయిన వారిలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తదితర హీరోలు అందరూ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వారే.


కానీ నిఖిల్ కు మాత్రం ఎలాంటి సపోర్టు లేకుండా స్వయంగా ఎదిగిన నటుడు అని చెప్పవచ్చు కేవలం ప్రతిభ ఆధారంగా తన మాటలను నమ్ముకొని ముందుకు వెళుతూ ఉన్నారు. మరి అలాంటి నటువంటి నిర్మాత అల్లు అరవింద్ పైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలోనే ఈ హీరోతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా నిఖిల్ తో అరవింద్ బ్యానర్ లో ఒక సినిమాకి కమిట్మెంట్ ఉంది అనే వార్తలు వినిపించాయి. అయితే అది కేవలం తెలుగు సినిమా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బడ్జెట్ ని మించి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: