బేబమ్మగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. చిన్న వయసులో నే హీరోయిన్ గా మారింది.ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఒక్క హిట్ కోసం తెగ అల్లాడిపోతుంది .

తెలుగులో వరుస గా మూడు హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా అయితే వెళ్లిపోయింది .ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ఓ సినిమా షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.

ఓ స్టార్ దర్శకుడి కారణం గా ఆమె ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'నా మాతృభాష 'తుళు'.. అయితే తెలుగు బాగానే మాట్లాడతాను. దీనికి కారణం ఇంతవరకూ తెలుగు బాగా తెలిసిన దర్శకులతో నే నేను చేశాను. అయితే లింగుసామిగారి తెలుగులో తమిళ యాస అయితే ఉంటుంది. నాకు అసలు తమిళమే తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు  నాకు అర్థం అయ్యేది కాదని తెలిపింది. ఇలా ఒక వారం రోజుల పాటు నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 

రామ్ గారికి తమిళం కూడా బాగా నే వచ్చు. అందువలన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన సపోర్ట్ ను తీసుకున్నాను. లింగుసామి గారు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు వివరించి చెప్పేవారు. ఇక ఆ తరువాత నేను లింగుసామి తెలుగు యాసకు అలవాటు పడిపోయానని తెలిపింది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన 'ఉప్పెన' సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది కృతి శెట్టి.

'ఉప్పెన' సినిమాతో వచ్చిన క్రేజ్‌ ను బాగానే యూజ్ చేసుకుంటోంది ఈ భామ . తొలి సినిమా విడుదల తర్వాత కథానాయికగా కృతి శెట్టి క్రేజ్ పీక్స్‌ లో అయితే ఉంది. ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: