బుల్లితెర టాప్ యాంకర్ సుమ ఈటీవీలో హోస్ట్గా చేస్తున్న షో సుమ అడ్. ప్రతి శనివారం సెలబ్రిటీ గెస్ట్ లతో వచ్చే ఈ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక షోకి వచ్చిన సెలబ్రిటీలు తమదైన స్టైల్ లో వేసే పంచులు సెటైర్లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటికి తోడు వాళ్ళు ఆడే గేమ్స్ సైతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.  ఈ క్రమంలోనే ఈ వారం(అక్టోబర్ 7) సుమ అడ్డా షోలో సుధీర్ బాబు నటించిన 'మామ మశ్చీంద్ర' మూవీ టీం సందడి చేసింది. హీరో సుదీర్ బాబుతో పాటు హీరోయిన్ మృణాళిని రవి, నటుడు దర్శకుడు హర్షవర్ధన్, సినిమాలో కీలక పాత్ర పోషించిన హరితేజ షోలో సందడి చేశారు. 

తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా, ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రోమో ని ఒకసారి పరిశీలిస్తే..'మీరు జనరల్ గా ఎలాంటి షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు?' అని సుధీర్ బాబుని సుమా అడగగా.." నేను అసలు షాపింగ్ చేయడానికి ఇష్టపడను" అంటూ సుధీర్ బాబు సుమకు పంచ్ వేస్తాడు.ఆ తర్వాత వినాయక చవితి పండక్కి వినాయకుని పెట్టేసి అక్కడ ప్లే చేసే సాంగ్స్ ఎలా ఉంటాయనే దాని గురించి సుమ మాట్లాడుతూ 'ఉదయం 6 గంటలకు అనగానే జై జై గణపతి అనే భక్తి సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత రాత్రి 12 గంటలకు అనగానే బ్యాగ్రౌండ్ లో ఐటమ్ సాంగ్ ప్లే అవుతుంది.

దాంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత సుధీర్ బాబు సుమా కలిసి ఓ స్పూఫ్ చేస్తారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు డాక్టర్ గా నటిస్తాడు.' కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. పిలుస్తున్నా?' అని సుమ సుధీర్ బాబుతో అంటే.. "ఎవరో ఒకరు తక్కువ వచ్చినా ఆ సర్జరీ మీకు చేసేస్తాను" అంటే చెప్పడంతో సుమ షాక్ అవుతుంది. దాంతో హరితేజ, హర్షవర్ధన్ పగలబడి నవ్వుతారు. ఆ తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి 'దూరం నుంచి చూస్తే వస్తువులు కనబడడం లేదు డాక్టర్?' అని చెప్పగానే సుమని మీరు దూరంగా నుంచోండి అని సుధీర్ బాబు అంటాడు. అప్పుడు సుమను చూపిస్తూ..' ఆమె కనిపిస్తుందా?' అని అడిగితే లేదని స్టూడెంట్ చెప్తుంది. దానికి సుధీర్ బాబు.." ఘోస్ట్ లు కనిపించ వన్నఅన్నమాట" అని సుమపై సెటైర్ వేయడంతో సోలో నవ్వులు విరిశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: