టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒక రు . ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు . వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు . అలాంటి సమయం లోనే ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో విజయ్ దేవరకొండ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత కూడా ఈయనకు పలు సినిమాల ద్వారా మంచి విజయాలు దక్కడంతో ఈయన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా వరకు పెరిగిపోయింది. ఇకపోతే ఈ మధ్యవకాలంలో మాత్రం విజయ్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 30 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయనున్నట్లు. మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd