టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హీరో ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. అనంతరం హీరోగా నువ్విలా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాక్సీవాలా, గీతగోవిందం లాంటి అనేక సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ వరుసగా అనేక సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. 

ఇక ఈ హీరో నటించిన తాజా చిత్రం "రెట్రో". ఈ సినిమా ఈ రోజున రిలీజ్ అయింది. రెట్రో సినిమా ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశాడు. అందులో ఆదివాసీలను అవమానిస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడాడని న్యాయవాది లాల్ చౌహన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీలను అవమానిస్తూ విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. అయితే కేసు నమోదు చేయడంపై పోలీసులు న్యాయ సలహా కోసం వేచి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.

ఇటీవల హీరో విజయ్ దేవరకొండ తమకు క్షమాపణలు చెప్పాలని ఏపీలోని మన్యం జిల్లా ఆదివాసి జేఏసీ నేతలు సైతం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. కానీ విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఆదివాసీలకు క్షమాపణలు చెప్పలేదు. దీంతో టాలీవుడ్ లోని హీరోలకు సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవడంతో కొంతమంది అభిమానులు నిరాశన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా సమయంలో వివాదంలో చెప్పుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ రెట్రో సినిమా సమయంలో ఇలా ఇబ్బందుల్లో పడడంతో సినీ అభిమానులు కాస్త ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. హీరోలు సినిమాల విషయంలో, వారు మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: