- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో పర్సంటేజ్ సిస్టం అమలు చేయకపోతే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వసూళ్లు ఎంత వచ్చినా థియేటర్ల అద్దెని మాత్రం నిర్మాతలు , పంపిణీ దారులు పెంచడం లేదని ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకొని భారీగా టికెట్ ధరలు పెంచుకుంటున్నారని అలాగే అదనపు షో లు వేసుకుంటున్నారని ... భారీగా వసూళ్లు వస్తున్నా నిర్మాతలు , పంపిణీదారులు లాభపడుతున్నారని ... అందులో తమకు మాత్రం ఎలాంటి వాటా దక్క‌డం లేదని థియేటర్లో యజమానులు వాపోతున్నారు. పెద్ద సినిమాలకు వచ్చిన వసూళ్లను నిర్మాతలు , పంపిణీ దారులు పూర్తిగా తమ జేబులో వేసుకుంటున్నారని ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సింగల్ స్క్రీన్ ను మూతపడటం ఖాయమని వారు వాపోతున్నారు.


తాము కూర్చున్న‌ కొమ్మను తామే నరుకుంటున్న చందంగా నిర్మాతలు , పంపిణీదారుల పరిస్థితి ఉందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్స్ షో వల్ల మాకు పైసా ఆదాయం రావడం లేదు .. టికెట్ ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకుంటున్న నిర్మాతలు థియేటర్ల అద్దెన మాత్రం పెంచడం లేదని ఎగ్జిబిటర్లు లబోదిబో అంటున్నారు. అద్దె విధానంలో అయితే తాము థియేటర్లను ఆడించడం అని ఇప్పటికే గోదావరి జిల్లాలలో థియేటర్లో యజమానులు తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ఎగ్జిబిట‌ర్లు మాత్రం ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. వారి మొర నిర్మాతలు, పంపిణీ దారులు ఎంతవరకు ఆలకిస్తారో అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: