ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో బన్నీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. బన్నీ అట్లీ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. బన్నీ వేణు శ్రీరామ్ కాంబో సినిమాకు గతంలో ఈ టైటిల్ ను పరిశీలించారనే సంగతి తెలిసిందే.
 
అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ సినిమాకు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా లేక మరో టైటిల్ ను పరిశీలిస్తారా చూడాల్సి ఉంది. బన్నీ అట్లీ కాంబో మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. 2027 సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. బన్నీ అట్లీ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది.
 
ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ బడ్జెట్ 800 కోట్ల రూపాయలు కాగా ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం కూడా ఒకింత సంచలనం అవుతోంది. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
ఒక స్టార్ హీరో మూడు పాత్రల్లో నటించడం, మూడు పాత్రలతో మెప్పించడం సులువైన విషయం కాదు. బన్నీ నిజంగా మూడు పాత్రల్లో నటిస్తే ఒకింత సంచలనం అవుతుంది. బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండగా బన్నీ త్రివిక్రమ్ కాంబో విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: