
షష్టిపూర్తి సినిమా తాజాగా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా కథ .. కథనాల్లోకి వెల్లి చూస్తే రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడో నటించిన ఏప్రిల్ 1 విడుదల సినిమాకు రివర్స్‌లో కథ ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీరామ్ (రూపేష్) ఓ లాయర్. నీతి, నిజాయితీలే ప్రాణం. అబద్ధం పొరపాటున కూడా చెప్పక పోవడంతో స్నేహితులు కూడా అతడికి ఉండరు. సంపాదన పెద్దగా ఉండదు. శ్రీరామ్ జానకి (అకాంక్షసింగ్)ని ఇష్టపడతాడు. జానకి కూడా శ్రీరామ్ ని ప్రేమించినా అబద్ధాలు చెప్పడం తప్పు కాదు.. నిజాయితీ వల్ల ఉపయోగం లేదని చెపుతుంది.. అప్పుడే పెళ్లి చేసుకుంటానని అంటుంది. మరి ఇందుకు శ్రీరామ్ ఒప్పుకున్నాడా ? తరువాత ఏమైంది ? అసలు శ్రీరామ్ అమ్మానాన్నలు (అర్చన, రాజేంద్ర ప్రసాద్) కథ ఏంటి అన్నదే ఈ సినిమా స్టోరీ.
ఇక ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ - శోభన నటించిన ఏప్రిల్ 1 విడుదల సినిమా గుర్తుకు వస్తుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ కి శోభన ఓ కండీషన్ పెడుతుంది. ‘ నెల రోజుల పాటు నువ్వు నిజాలే చెప్పాలి ’ అని. ఇందులో ఆ కండీషన్ రివర్స్ అయ్యిందనుకోవాలి. అక్కడ హీరోయిన్ ఆ కండీషన్ పెడితే.. ఇక్కడ హీరోయిన్ ‘నువ్వు అబద్ధాలు చెప్పాలి..’ అంటుంది. నీతి నిజాయతీలను నమ్ముకొన్న హీరో ఆ తరవాత ఏం చేశాడన్నది ఈ షష్టిపూర్తి సినిమా. ఏప్రిల్ 1 విడుదల సినిమా లో హీరోయిన్ కండీషన్ పెట్టడానికి బలమైన కారణం ఉంటుంది. ఇక్కడే మంచి డ్రామా ఉంటుంది.. తాను చెప్పే నిజాల వల్లే కొంపలు కొల్లేరు అవుతాయి. చివరకు అది హీరో పీకల మీదకు వస్తుంది. అదంతా ఫన్‌తో నడించాడు సీనియర్ దర్శకుడు వంశీ.
అయితే షష్టిపూర్తి సినిమాలో ఆ డ్రామా, ఆ ఫన్ మిస్ అయ్యింది. హీరో నిజాలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా పెద్ద తేడా ఉండదు. హీరోయిన్ ఇలా కండీషన్ పెట్టడానికి కూడా పెద్దగా కారణం కనిపించదు అన్నట్టుగా కథ మూవ్ అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు