సినీ నటి రష్మిక మందన్న తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఒకరోజు మనకు అనుకూలంగా అనిపించింది. మరుసటి రోజు మర్చిపోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు తోడుగా నా కుటుంబం, స్నేహితులు ఎప్పుడూ ఉన్నారు. అది నా అదృష్టంగా భావిస్తాను. కష్టసుఖాలను ఎదుర్కోవడంలో వాళ్లు ఎప్పుడు నాకు అండగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే నేను నటిని అవుతానని అనుకోలేదు. అసలు ఎలాంటి ప్రణాళికలు కూడా వేసుకోలేదు. ఇప్పుడు ఇలా నటిగా మరి మీ ముందు ఉన్నానంటే నేను ఎంత అదృష్టవంతురాలిని అని అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఉత్తమంగా ఉండడానికి ప్రయత్నించాలి. మనసుకు నచ్చిన పని మాత్రమే చేయాలి. నచ్చిన పనిని చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. ముఖ్యంగా ఇతరులను సంతోష పెట్టాలని ఎప్పుడూ అనుకోకండి. ఆ భారాన్ని ఎప్పుడు మోయకండి. ఎల్లప్పుడూ మీ సంతోషంపైనే దృష్టి పెట్టండి అని రష్మిక చెప్పుకొచ్చారు. 

నేషనల్ క్రష్ రష్మిక మొదట 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.

ఇప్పుడు రష్మిక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ అందాల భామ రణబీర్ కపూర్ తో కలిసిన నటించిన యనిమాల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ఛావా సినిమాలో నటించింది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.








మరింత సమాచారం తెలుసుకోండి: