మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. హార్డ్ డిస్క్ వివాదం ద్వారా కన్నప్ప మూవీ ఒకింత వార్తల్లో నిలవడం సోషల్ మీడియలో సంచలనం అయింది.
 
అయితే మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. బాల్యం నుంచి యాక్టర్ కావాలనేది నా ఆశయమని ఆయన అన్నారు. చిన్నప్పుడు నేను పెద్ద అందగాడిని కాదని ఇప్పుడు కూడా పెద్ద అందగాడిని కాదని విష్ణు సరదాగా తెలిపారు. నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే కాపాడుకుంటానని దేవుడిని కోరుకునేవాడినని దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు.
 
యూనివర్సిటీ నా బాధ్యత అని విష్ణు పేర్కొన్నారు. నా తర్వాత కూడా యూనివర్సిటీ నిలిచిపోవాలని ఆయన వెల్లడించారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు ఓనర్లు ఎవరో తెలియదని రతన్ టాటా మరణానంతరం కూడా టాటా సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విష్ణు తెలిపారు. అలా ప్రొఫెషనల్ గా ఉండాలని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు ఈ కామెంట్లు చేశారు.
 
త్వరలో కన్నప్ప సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. కన్నప్ప మూవీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని విష్ణు వెల్లడించారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ సినిమా ఈవెంట్ కు ప్రభాస్ హాజరు కానున్నారు. విష్ణు నటించిన ఢీ సినిమా రేపు థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: