- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టికెట్ లేని వాళ్ళు ముందు బండి ఎక్కారు అన్న సామెత వెనకటికి ఒకటి ఉంది. ఇప్పుడు అది టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ - దగ్గుబాటి సురేష్ బాబు విషయంలో నిజం అయిందని కొందరు నిర్మాతలు చాటుమాటుగా గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో గిల్ట్‌ అని ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. యాక్టివ్గా సినిమాలు తీస్తూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నిర్మాతలు అందరూ కలిసి దీనిని ఏర్పాటు చేసుకున్నారు. వీరందరికి ఒక సీక్రెట్ వాట్సప్ గ్రూపు ఉందట. అందులో ఎప్పటికప్పుడు డిస్కషన్స్‌ నడుస్తూ ఉంటాయని అంటారు. అయితే ఎప్పుడూ పెద్దగా స్పందించని నిర్మాతలు ఇద్దరు ఉన్నారని ఓ గుసగుస ఎప్పటి నుంచో ఉంది. ఆ ఇద్దరు ఎవరూ కాదు అల్లు అరవింద్ - సురేష్ బాబు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల‌ దుర్గేష్ చొరవ తీసుకొని టాలీవుడ్ జనాలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు స‌మావేశం ఏర్పాటు చేశారు.


దాదాపు 100 మంది వరకు ఆయన ఆహ్వానాలు పంపారట. ఈ క్రమంలోనే యాక్టివ్ ప్రొడ్యూసర్‌ గిల్డ్ వాట్సాప్ గ్రూప్ లో చంద్రబాబు, ప‌వ‌న్‌ను కలిసేందుకు ఎవరు వస్తున్నారు ? అంటూ ఓ నిర్మాత మెసేజ్ పెట్టారట. ఆ మెసేజ్ కు ఫస్ట్ వచ్చిన రెండు రెస్పాన్స్ అల్లు అరవింద్.. సురేష్ బాబువే అని ఓ సమాచారం చ‌క్కెర్లు కొడుతోంది. మామూలుగా ఏ మెసేజ్ కు పెద్దగా రెస్పాండ్ గాని అరవింద్ - సురేష్ బాబు చంద్రబాబును, పవన్ ను కలిసి ఎందుకు అంత త్వరగా రెస్పాండ్ కావడంతో ఈ విషయం ఇప్పుడు గిల్ట్‌ వర్గాలలో కాస్త హాట్‌ టాపిక్ గా మారింది. విచిత్రం ఏంటంటే సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తీసి చాలాకాలం అయింది. ఆల్మోస్ట్ ప్రొడక్షన్ ఆపేసిన ఆయన డిస్ట్రిబ్యూటర్ గా... ఎగ్జిబిటర్‌గా ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: