బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలను ఆమీర్ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఈ మధ్య కాలంలో ఆమీర్ ఖాన్ కి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలు దక్కి చాలా కాలం అవుతుంది. ఆఖరుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆమీర్ నటించిన దంగల్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు కూడా దక్కాయి. కానీ ఆ తర్వాత ఆమీర్ హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు విడుదల అయిన అవి దంగల్ రేంజ్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు.

ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత ఆమీర్ అదిరిపోయే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రజనీ కాంత్ హీరో గా నటిస్తూ ఉండగా ... నాగార్జున ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అమీర్ ఖాన్ ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత లోకేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అసలు విషయం లోకి వెళితే ... ఆమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... నేను నా తదుపరి మూవీ ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాను. ఆ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతుంది అని అమీర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన అమీర్ , లోకేష్ కాంబోలో మూవీ రూపొందితే దానిపై అత్యంత భారీ అంచనాలను నెలకొనే అవకాశం చాలా వరకు ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: