
బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్నా , చాలామంది కథానాయికల మాదిరి గానే ఆమెకు స్టార్డం రావడం కొంచెం ఆలస్యమైంది . కానీ సోషల్ మీడియా లో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది . ఈ అమ్మడు షేర్ చేసే హాట్ ఫోటోల కి కోట్లు మంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు . ఇటీవల దిశా ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏ.డి’ లో కీలక పాత్రలో కనిపించింది . ఈ సినిమా వసూళ్లు రూ.1000 కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇక దిశా నటించిన మరో సినిమా ‘కంగువ’ డిజాస్టర్ అయినప్పటికీ .. ఆమె గ్లామర్‌కు మాత్రం డిమాండ్ తగ్గలేదు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు దిశా పటాని తీసుకునే రెమ్యునరేషన్ ఏకంగా రూ. 3 కోట్లు. ఆమె వద్ద ఉన్న ఆస్తులు కూడా కోట్లల్లోనే ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలే చేసినా.. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది . ఇండస్ట్రీలో ప్రస్తుతం దిశా పటాని కంటే గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్లు లేరు అని సినీ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్‌లో సరైన అవకాశాలు రాకపోయినా, బాలీవుడ్‌ను తన అందంతో, స్టైల్‌తో ఓవర్‌టేక్ చేసిన దిశా.. నిజంగా ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం.