ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆ బ్యూటి అంత క్రేజ్ సంపాదించుకోవడమే. ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడమే. ఆమె మరెవరో కాదు "దీపిక పిల్లి". అందాల ముద్దుగుమ్మ దీపిక పిల్లి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం రీసెంట్గా హల్దీ ఫోటోలు షేర్ చేయడమే . టిక్ టాక్ వీడియోల ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు .


కొంతమంది టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఆ పాపులారిటి ని మాత్రం అలాగే వదిలేశారు.  కొంతమంది మాత్రమే టిక్ టాక్ ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని స్టార్స్ గా మారారు . అందులో ఒకరే దీపికాపిల్లి. మనందరికీ సుపరిచితురాలే. కెరియర్ స్టార్టింగ్ లో జబర్దస్త్ షోలో కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమయ్యే "ఢీ" డాన్స్ షోలో టీం లీడర్గా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు . దీంతో ఈ అమ్మడుకి బాగా పాపులారిటి పెరిగిపోయింది . స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ అంటే అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో సోషల్ మీడియాలో అర్థం చేసుకోవచ్చు .



ఇటీవల యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే సినిమాలో హీరోయిన్గా కనిపించి నటించి మెప్పించింది. ఈ సినిమాలో దీపిక యాక్టింగ్ కి బాగానే మార్కులు పడ్డాయి.  కానీ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీపికపిల్లి తాజాగా తన అభిమానులతో హల్దీ ఫోటోలు షేర్ చేసుకుంది . పసుపు బట్టల్లో చేతిలో బిందె పట్టుకొని ఫోటోకి ఫోజులిస్తూ హడావుడి చేసింది. దీంతో ఈ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇవి దీపిక పిల్లి హాల్ది ఫోటోస్ నా..? లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి అక్కడ తీసుకున్న హల్దీ ఫొటోస్ నా..? అంటూ కొంతమంది జనాలు మాట్లాడుతుంటే.. మరి కొంత మంది మాత్రం ఈ దీపిక పిల్లి అప్పుడే పెళ్లి చేసేసుకుంటుందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు . కానీ చాలామంది మాత్రం దీపిక పిల్లి హల్ది ఫొటోస్ కావు ఇవి అని ఆమె వేరే వాళ్ల హల్ది ఫొటోస్ లో ఈ విధంగా ఫోటోకి ఫోజులు ఇచ్చింది అంటూ క్లారిటీ ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: