
కూలీ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుండగా బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం సహజమేనని ఆమె అన్నారు. తానూ యాక్ట్ చేసిన సినిమాలు సైతం ఇతర స్టార్ హీరోల సినిమాలకు పోటీగా ఎన్నోసార్లు విడుదలయ్యాయని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలు అనుకున్న సమయానికే రిలీజ్ కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో నేను నటించిన సలార్ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైందని ఆమె తెలిపారు.
ఏ సినిమా ప్రత్యేకత ఆ సినిమాకు ఉంటుందని ఈ విషయంలో నటీనటులు ఏం చేయలేరని శృతి హాసన్ వెల్లడించారు. సినిమా నిర్మాతలే ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య సమయం ఉండేలా చూసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. కూలీ, వార్2 సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని ఈ రెండు సినిమాలను చూసేందుకు ప్రేక్షకులకు సమయం ఇవ్వాలి కదా అని శృతి హాసన్ అభిప్రాయపడ్డారు.
లోకేష్ కనగరాజ్ సినిమాలలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని కూలీ సినిమాను సైతం అదే స్థాయిలో తెరకెక్కించారని ఆమె తెలిపారు. కాకపొతే ఈ సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కిందని ఆమె చెప్పుకొచ్చారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.