కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని సినిమాలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. దానితో ఈయనకు దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తాజాగా లోకేష్ కనగరాజ్ ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో భాగంగా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజా ఈవెంట్లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ ... ఒక సినిమా సక్సెస్ అంటే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లు రాబట్టడం కాదు , అసలైన సక్సెస్ అంటే మనం అనుకున్న కథని , మన మనసులో అనుకున్న విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళగలిగినట్లయితే అది అసలైన సక్సెస్ అని లోకేష్ కనగరాజ్ తాజా ఈవెంట్లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఈయన తాజాగా చెప్పిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ లో ఆమీర్ ఖాన్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే లోకేష్ కనగరాజ్ తన తదుపరి మూవీ ని అమీర్ ఖాన్ తో చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అలాగే కొన్ని సంవత్సరాల క్రితం లోకేష్ కనగరాజ్ "ఖైదీ" అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఖైదీ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు అని , ఒక వేళ వీలైతే లోకేష్ తన తదుపరి మూవీ గా ఖైదీ 2  చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ మూవీ ని ఎవరితో చేస్తాడు అనే దానిపై ప్రస్తుతానికి మాత్రం క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk