మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.దానికి కారణం అక్కినేని హీరోతో ఈ హీరోయిన్ డేటింగ్ వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడమే.. మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి గుంటూరు కారం, లక్కీ భాస్కర్,మెకానిక్ రాకీ,ది గోట్ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలో లక్కీ భాస్కర్, ది గోట్ సినిమాలు ఈ హీరోయిన్ కి తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఈ ఏడాది వెంకటేష్ తో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో మీనాక్షి చౌదరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం మీనాక్షి చౌదరి నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు అనే మూవీలో నటిస్తోంది. 

వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఎందుకు మారింది అంటే అక్కినేని సుశాంత్ తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడమే.. గత కొద్ది రోజుల నుండి అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో మీనాక్షి చౌదరి డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా వచ్చింది. అప్పటినుండి వీరి మధ్య లవ్ నడుస్తోంది అని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వినిపించినప్పటికీ ఈ రూమర్లను చాలా సార్లు ఖండించింది మీనాక్షి చౌదరి. 
కానీ ఇద్దరి మధ్య ఉండే బంధం ఎన్నో రోజులు గుట్టుగా ఉండలేదు. ఎప్పుడో ఒక సమయంలో కచ్చితంగా బయట పడుతూనే ఉంటుంది. అలా తాజాగా సుశాంత్ మీనాక్షి చౌదరి ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో నుండి నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో మీనాక్షి తన మొహానికి మాస్క్ వేసుకున్నప్పటికీ చాలా స్పష్టంగా ఈ హీరోయిన్ అనే తెలిసిపోతుంది.అలా ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో ఒకేసారి నడుచుకుంటూ రావడంతో వీరిద్దరి మధ్య లవ్ కన్ఫామ్ అంటూ నెటిజన్లు కన్ఫామ్ చేస్తున్నారు. అంతే కాదు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని తేల్చేస్తున్నారు. మరి ఈ ఎయిర్పోర్ట్ వీడియో పై మీనాక్షి చౌదరి ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: