మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా చిరంజీవి లాంటి పెద్ద హీరో ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ఎంపికచేసుకోవడం నిజంగా పొరపాటే చాలామంది విమర్శించారు. చిరంజీవి తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేసుకోకుండా ఇలాంటి నాసిరకం సినిమాలు  చేయడం ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు. అలా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి ప్రవర్తన చూసి నిర్మాత అనిల్ సుంకర సైతం షాక్ అయ్యారట.మరి ఇంతకీ చిరంజీవి ఎలా ప్రవర్తించారో నిర్మాత మాటల్లోనే తెలుసుకుందాం.భోళా శంకర్ మూవీ ప్లాప్ తర్వాత నాకు చిరంజీవి గారు ఇచ్చిన మద్దతు నేను నా లైఫ్ లో మర్చిపోలేను.

సినిమా విడుదలకు ముందే మీరు బాగా అలసిపోయారు.. కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పారు.ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక సినిమా డిజాస్టర్ అవ్వడంతో నేను చాలా బాధపడ్డా.. ఆ సమయంలో చిరంజీవి నన్ను ఎంతగానో ఓదర్చారు. అలాగే మద్దతు కూడా ఇచ్చారు.ఆయన తన మంచి మనసుతో ఒక్క రూపాయి కూడా ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇక ఆ కష్టకాలంలో నా సహచర ప్రొడ్యూసర్లు కూడా నాకు ఎంతగానో అండగా నిలిచారు. మేము ఏ సినిమా విడుదలైనా సరే ఒకరోజు ముందు నిర్మాతలం అందరం కలిసి మాట్లాడుకుంటాం. అలా నా సినిమా విడుదలకు ముందు రోజు అందరం కలిసి మాట్లాడుకున్నాం.

ఇక సినిమా విడుదలయ్యాక ఎంతోమంది సెలబ్రిటీలు, నిర్మాతలు నాకు ఫోన్ చేసి బాధపడకండి అంటూ ఓదార్చారు. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన మద్దుతు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే అజిత్ కెరీర్ లో హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో చాలావరకు మార్పులు చేర్పులు చేసి భోళా శంకర్ పేరుతో రీమేక్ చేసినప్పటికీ తెలుగులో హిట్ అవ్వలేదు. కోవిడ్ కారణంగానే ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు.కోవిడ్ కంటే ముందు ఈ సినిమా విడుదలైతే హిట్ అయ్యేది అని అభిప్రాయపడ్డాం అంటూ భోళా శంకర్ ప్లాప్ తర్వాత తన పరిస్థితి ఎలా ఉంది.. మిగతా వాళ్ళు తనని ఎలా ఓదార్చారు అనే విషయాలను పంచుకున్నారు నిర్మాత అనిల్ సుంకర.

మరింత సమాచారం తెలుసుకోండి: