అక్కినేని నాగార్జున ఎలాంటి వ్యక్తిత్వం గలవారో చెప్పనక్కర్లేదు. ఆయన ఏ విషయంలో అయినా సరే చాలా మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తారు.అయితే అలాంటి నాగార్జున ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన బిజినెస్ లని కూడా విస్తరించుకుంటారు. అలా నాగార్జున పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్ లు చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అంతే కాదు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన సినీ సెలబ్రెటీల లిస్టులో కూడా నాగార్జున పేరు ఉంటుంది.అయితే అలాంటి నాగార్జున ఓ విషయంలో అది ఏం చెబితే నేను అది చేయాలా.. నో నేను చేయను అంటూ రిజెక్ట్ చేశారట. మరి ఇంతకీ నాగార్జున ఎవరిని రిజెక్ట్ చేశారయ్యా అంటే.. 

నాగార్జున రిజెక్ట్ చేసింది మనుషులనైతే కాదు. సోషల్ మీడియాని.అవును మీరు వినేది నిజమే.. ఎందుకంటే నాగార్జున సోషల్ మీడియాకి ఆమడ దూరంలో ఉంటారు.. ఇక ఈ విషయం గురించి గతంలో రానా హోస్ట్ గా చేసే ఓ టాక్ షో లో మాట్లాడుతూ.. నాకు సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ట్విట్టర్ స్టార్ట్ అయిన సమయంలో అందులో అకౌంట్ ఓపెన్ చేశా..కానీ ఆ తర్వాత నోటిఫికేషన్ ఆన్ చేస్తే వాళ్ళు ఏం చెబితే మనం అదే చేయాలి వాళ్ళు తినమన్నప్పుడు తినాలి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోమంటే అదే వేసుకోవాలి..వాళ్ళు ఏం చేయమంటే అదే చేయాలి.

కానీ ఇలా ఎవరో తెలియని అనామకుల కోసం నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ట్విట్టర్లో నోటిఫికేషన్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే ఎవరి లైఫ్ వారికి నచ్చినట్లు ఉండాలి.అంతేకానీ ఒకరు చెప్పింది మనం చేయాలంటే కుదరదు కదా.. అందుకే అప్పటినుండి సోషల్ మీడియాని దూరం పెట్టేసాను అంటూ సోషల్ మీడియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నాగార్జున. అయితే ఈ వ్యాఖ్యలు నాగార్జున తాను నటించిన వైల్డ్ డాగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రానా హోస్ట్ గా చేసే టాక్ షోలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: