
ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. తాజాగా శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఇంట్లో కనిపించడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ విషయం చర్చకు దారి తీసింది.
అయితే, ఈ వార్తలు శ్రీలీల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనని అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో, ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఆమె భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదని వారు కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై శ్రీలీల కానీ, కార్తీక్ ఆర్యన్ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్తలు నిజమా కాదా అనేది తెలియాలంటే వారి నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
శ్రీలీల కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీలీల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు