నేపాల్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే ఆ దేశంలో ప్రజలు తిరుగుబాటు చేయడంతో పాలన వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఆ దేశ నాయకులు పూర్తిగా అవినీతి చేయడం సోషల్ మీడియాపై నిషేధం విధించడం వల్ల ప్రజలు ఆగ్రహానికి గురై అల్లర్లకు దారితీసింది.. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఇతర నాయకులంతా రాజీనామా చేసి పారిపోయారు. అంతేకాదు ప్రజలు వారి ఇండ్లను కూడా తగలబెట్టేశారు. ఇదే తరుణంలో నేపాల్ లో ప్రస్తుతం ఖాట్మండు మేయర్ గా ఉన్నటువంటి బాలేంద్ర ప్రధాని అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈయనకే ఎక్కువగా యువత నుంచి ప్రజల నుంచి ఆదరణ  లభించడంతో ఆయన ప్రధాని పగ్గాలు చేపడతారనే వార్తలు వినిపిస్తున్నాయి..ఇదిలా నడుస్తున్న సమయంలో బాలెంద్రా షా గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

 అవేంటంటే ఆయనకు భారతదేశం అంటే పడదని, ముఖ్యంగా భారత సినిమాలపై ఆయన నిషేధం విధించారని సోషల్ మీడియాలో ఒక వార్త హైలైట్ అవుతుంది.. రెండు సంవత్సరాల క్రితం ఆయన ఖాట్మండ్ మేయర్ గా పనిచేస్తున్న సమయంలో భారతీయ సినిమాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారట. ఈయన  ఆదేశాలు జారీ చేసిన తర్వాత పుకారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా ఆయన మార్గాన్ని అనుసరించి బాలీవుడ్ చిత్రాలను నిలిపివేయాలని నేపాల్ లో మెట్రోపాలిటన్ నగరాలలో సినిమా హళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ చిత్రాల్లో ప్రభాస్ హీరోగా చేసినటువంటి ఆదిపురుష్ సినిమా ఉండడం విశేషం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలేంద్ర పూర్తిగా ఆ చిత్రాన్ని నిషేధించాలని చెప్పుకొచ్చారు. దీనికి కారణం కూడా చెప్పారు..

అయితే ఈ సినిమాలో సీత పాత్రని పూర్తిగా తప్పుగా చూపించారని ఆమె జన్మస్థలం భారత్ కాదని నేపాల్ అని చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమాలో తప్పుగా చూపించడం వల్ల మాకు నచ్చలేదని ఈ సినిమాను పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. సినిమాను సెట్ చేయడానికి మూడు రోజుల సమయం ఇచ్చిన ఆదిపురుష్ చిత్ర యూనిట్ వారు పట్టించుకోకపోవడంతో ఈ సినిమాను అక్కడ బ్యాన్ చేశారు.. ఈ విధంగా బాలేంద్ర షా ప్రధానిగా రాబోతున్న సమయంలో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: