టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథ రచయితగా , స్క్రీన్ ప్లే , డైలాగ్ రైటర్ గా పని చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన తన కెరీర్లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీ లు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ , అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

దానితో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబోలో మూవీస్ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టి అవకాశం ఉండడంతో త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని వెంకటేష్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో తిరవిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. వీరి కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ త్రివిక్రమ్ , వెంకటేష్ మూవీ కోసం తమన్ తో కాకుండా వేరే సంగీత దర్శకుడు తో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: