ఉత్తరాంధ్ర ప్రాంతంలో 'మిరాయ్' సినిమాకు మంచి థియేటర్లు లభించడంతో, ఈ ప్రభావం 'ఓజీ' కలెక్షన్స్‌పై పడిందని సినీ వర్గాల సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో 'మిరాయ్' థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
దీంతో కొందరు సినీ ప్రేమికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు 'మిరాయ్' ఆడుతున్న కొన్ని థియేటర్లను 'ఓజీ'కి కేటాయించాలని కోరుతున్నారు. అయితే, 'మిరాయ్' సాధించిన విజయం, ప్రేక్షకుల ఆదరణ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే 'మిరాయ్' ఇంకా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
కొంతకాలం గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల పంపిణీ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. 'మిరాయ్' సినిమా కంటెంట్, అది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఈ పరిస్థితి చూపిస్తోంది. మరోవైపు, 'ఓజీ' సినిమాపై ఉన్న అంచనాలు భారీగా ఉండటంతో, మరిన్ని థియేటర్లలో విడుదల కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల మధ్య థియేటర్ల వార్ ఇంకా కొనసాగుతోంది. ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. ఓజీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి