
సినీ అనుభవం .. ఓజీకి ముందే సైయేషా షా లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ, ఆమె నటనను చాలామంది గమనించారు. కానీ ఆమె అసలైన బ్రేక్ మాత్రం పవన్ కల్యాణ్ తో వచ్చింది. ఓజీలో ఆమె ఎమోషనల్ సీన్స్ చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే ఇంత నేచురల్‌గా నటించడం పెద్ద విషయం అని అందరూ కొనియాడుతున్నారు. పవన్, ప్రియాంక, కో-స్టార్స్ తో క్యూట్ బాండింగ్ .. ఓజీ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో సాయేషా గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంది. పవన్ గారితో ఆటలు ఆడుకోవడం, చాక్లెట్లు గిఫ్ట్ చేసిన అర్జున్ దాస్ గురించి చెప్పుకోవడం, ప్రకాశ్ రాజ్‌తో పనిచేయడం తనకెంతో ఆనందమని తెలిపింది. దర్శకుడు సుజిత్ ఇచ్చిన అవకాశానికి, మొత్తం ఓజీ టీమ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
వైరల్ అవుతున్న ఫోటోలు .. ఓజీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్‌తో దిగిన సాయేషా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్‌తో ఉన్న పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "చిన్న పాపే సినిమాలో హైలైట్ అయిపోయింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద.. ఓజీ సినిమాతో సాయేషా షా స్టార్‌డమ్ రుచి చూసింది. తన సహజమైన నటనతో, పవన్ కల్యాణ్‌తో పంచుకున్న స్క్రీన్ స్పేస్‌తో, సాయేషా భవిష్యత్తులో టాప్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
https://www.instagram.com/p/DPD_8CFCJMl/?utm_source=ig_web_copy_link