లైంగిక వేధింపులు అనే అంశం ఎప్పటికి సినిమా ఫిల్డ్‌ను వదిలి పెట్టని భేతాళ కధలా ఉన్నట్లుంది.ఎందరో నటిమణులు వీటి పేరు చెప్పుకుని రోడ్డు ఎక్కుతున్నారు. నిజనిజాలేందో,అందులో వున్న నిజమెంతో వారికే తెలియాలి.ఇక పోతే మరో నటి ఈ విషయంలో రచ్చరచ్చ చేస్తుంది.వివరాలు తెలియాలంటే పూర్తిగా చదవ వలసిందే. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద జూనియ ర్ ఆర్టిస్ట్ సునీత బోయ.సినిమాల్లో అవకాశం ఇస్తాం అని ఉపయోగించుకుని అవసరం తీరాక ముఖం చాటేసారని,గత ఎన్నిక ల్లో జనసేన పార్టీకోసం పనిచేసిన తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ ఆమె గొలుసు లతో బంధించుకుని హల్ చల్ చేసింది.బుధవారం నాడు రాత్రి అంతా ఫిల్మ్ ఛాంబర్‌లోనే తనను తాను నిర్భందించుకుంది.




ఎలక్షన్ టైంలో జనసేన పార్టీకి పనిచేస్తే,గీతా ఆర్ట్స్‌లో అవకాశాలు ఇస్తామన్నారని,ఇందుకోసం తన సొంత ఖర్చులతో జన సేన పార్టీకి పనిచేశానని,తీరా ఎన్నికలు ముగిసిన తరువాత గీతా ఆర్ట్స్‌కు చెందని నిర్మాత బన్నీ వాసుని కలిస్తే..ఆయన అసలు పట్టించుకోవడం లేదని వారి తీరుకు నిరసనగా తనను తాను బంధించుకున్నానన్నారు సునీత. దీనిపై వెంటనే గీతా ఆర్ట్స్,పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు..ఇక ఈ సంఘటనపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో గురువారం తెల్లవారు జామున పోలీసులు ఫిల్మ్ ఛాంబర్ తలుపులను పగులగొట్టి,బోయ సునీతను అదుపులోకి తీసుకున్నారు.




కాగా సునీత బోయ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని గతంలో కూడా మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించా డని అప్పట్లో మీడియాకి ఎక్కింది.అంతే కాకుండా తన ఫ్లాట్‌కి రమ్మని,డబ్బులు పేటీఎం చేస్తానంటు చెప్పేవాడని ఆమె ఇలాంటి గొడవే చేసిందంటూ,ఇప్పుడు చేస్తున్న ఆమె ఆరోపణలను కొట్టిపరేస్తున్నారు.ఇంతకీ ఇంతగా అల్లరి చేస్తున్న సునీత బోయ ఎవరంటే చిన్నాచితకా సినిమాల్లో నటించిన నటి.టాలీవుడ్ ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ,టీవీ9 చర్చతో హాట్ టాపిక్ అయ్యింది.అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి యాక్టివ్ మెంబర్‌గా పనిచేసింది.అప్పట్లో ఆమెపై దాడి కూడా జరగడంతో వార్తల్లోకి వచ్చింది.ఇక మొత్తానికి ఫిల్మ్ ఛాంబర్ వద్ద జూనియర్ ఆర్టిస్టుల నిరసనలు హాట్ టాపిక్ అవుతున్నాయని అనుకుంటున్నారు ఈ విషయం విన్న వారు..



మరింత సమాచారం తెలుసుకోండి: