
నంద్యాలలో గెలుపు మాదే : మంత్రి అఖిల ప్రియ
నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.నంద్యాల ఉప ఎన్నికలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన ఈ నెల 24న అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
గుంటూరులో రెండ్రోజుల జగన్ దీక్ష
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. రైతు సమస్యలపై మరోసారి దీక్షకు సిద్ధమవుతున్నారు. గుంటూరు వేదికగా ఏప్రిల్ 26, 27 తేదీలలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. జగన్ రెండ్రోజులపాటు ఈ దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో ధరలు పతనం అవుతున్నాయి. దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. ధరలు లేకపోవడంతో ఇద్దరు మిర్చి రైతులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిర్చి రైతులతో మాట్లాడి వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు.
తెలంగాణ పాఠశాలలకు సెలవులు
ఎండలు మామూలుగా లేవు... బయట అడుగపెట్టాలంటే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. అలాంటి పరిస్థితుల్లో చిన్నారులు స్కూళ్లకి ఎలా వెళ్లగలరు అందుకే... తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవులను బుధవారం నుంచే ఇస్తున్నట్టు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు రోజుల ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేశారు : వెల్లంపల్లి
ఏపి సీఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు... కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గొంతు కోశారని ఆయన మండిపడ్డారు. డీపీ మేనిఫెస్టోలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు పర్మినెంట్ చేయమని చెప్పడం మోసం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. రైల్వే జోన్ రాలేదని విశాఖకు చెందిన ప్రసాద్ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందని వెల్లంపల్లి అన్నారు.
వాహనాలకు నకిలీ భీమాలు...జాగ్రత్త
తెలంగాణ లో వాహన బీమాపై నగరంలో నకిలీ దందా కొనసాగుతోంది. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే, సదరు సంస్థలతో ఎలాంటి ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆయా సంస్థల పేరిట పెద్ద ఎత్తున నకిలీ బీమా సర్టిఫికెట్‌లను తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియంల కంటే తక్కువ మొత్తంకే ఈ సర్టిఫికెట్‌లు లభించడంతో ఆటో పర్మిట్‌ల పునరుద్ధరణలో ఆర్టీఏ ఏజెంట్‌లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. కొన్ని బీమా సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు, ఫైనాన్స్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నగరంలో నకిలీ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.