
ఇంతలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, చికెన్ బిర్యానిల దైయ్యం పట్టిన ప్రతి వారు ఈ ముచ్చట తెలుసుకోవలసిందే. ఈ కరోనా టైంలో ప్రజలు చేస్తున్న పెద్ద తప్పు రోగాలను కొనుక్కోవడం. ఇక విషయం ఏంటంటే. ఇప్పటికే పలు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అనంతపురం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలో బూజు పట్టిన ఆహార పదార్థాలు, పాచిన చికెన్ ఇతర ఆహారపదార్థాలు అమ్ముతున్న హోటల్ భాగోతం బయటపడింది. కదిరిలో పట్టణంలోని శ్రీ క్రిష్ణా గ్రాండ్ హోటల్‌లో ముందురోజు మిగిలి పోయిన వంటకాలను ఫ్రెష్ ఫుడ్ అంటూ పార్శిల్ రూపంలో ప్రజలకు అందజేస్తున్న ఘటన చూస్తే వాంతులు వస్తాయి.
ఈ దారుణాన్ని చూడలేని ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంలో మున్సిపాలిటీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బృందం తనిఖీ చేయగా, అది నిజమని తేలింది. ముందురోజు వండిన చికెన్‌ను పార్సిళ్ల రూపంలో సిద్ధం చేయడాన్ని వారు గుర్తించారట. అలాగే స్వీట్ కార్న్ డబ్బా తెరిస్తే బూజుపట్టి అందులో తెల్లని పురుగులు బయటకొచ్చాయట. అంతే కాకుండా ఏ ఒక్కరు మాస్కులు గానీ, చేతికి గ్లౌజులు గానీ, తలకు క్యాపులు గానీ ధరించకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు.
వెంటనే హోటల్‌ను సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.. అసలే బయట కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడున్న హోటల్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వివాదస్పదంగా మారింది. ఇకపోతే అసలే భయం లేకుండా వ్యవహరిస్తున్న ప్రజలను కాపాడటం ఎవరి తరం కాదన్న విషయం ఇక్కడ అర్ధం అవుతుంది.