జగన్ పరిపాలన : అభివృద్ధి  పథకాల జాడేది ?
'ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మీఊరికి రోడ్డు వేయిస్తా!'... 'నన్ను గెలిపిస్తే మీ కాలనీలో పూరిళ్లు లేకుండా  ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయిస్తా '...మీ కాలనీకి  వాటర్ ట్యాంక్ కట్టిస్తా'... "నన్న గనుక గెలిపించారంటే ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తా.".... ఇలాంటి వాగ్దానాలు ఎన్నో  అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో చేస్తారు. గెలిచాక వీలున్నవి చేస్తారు.  ఇది ఎన్నికల భారత దేశంలో సహజంగా వినిపించి, కినిపించే చిత్రం.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు అందిపుచ్చుకునిఅప్పుడే రెండేళ్లు దాటి పోయింది.  ఎం.ఎల్.ఏలు గా గెలిచిన వారు కేవలం నియోజక వర్గ కేంద్రానికే పరిమితం అయ్యారన్న అపవాదు అధికా పార్టీ వర్గాల్లో ఉంది. తాను చేసిన వాగ్దానాలను ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం వారిని పీడిస్తోంది.  అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వానికి తాము ప్రతిపాదనలు పంపినా ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో వారు ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సమాధానం చెప్పలేకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ శాసన సభ్యులకు  ఇది మింగుడు పడని అంశంగా ఉంది. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం అధికార పార్టీ ఎం.ఎల్.ఏగా ఉన్న సీనియర్ నేతకు రాజకీయాల్లో  సౌమ్యుడనే పేరుంది. ఆయన కూడా ఓ సందర్భంగా మీడియా ముంది తన అక్కసు వెళ్లగక్కారు. ఎందుకు ఎం.ఎల్.ఏలుగా గెలవడం? అంటూ వాపోయారు. నెల్లూరులో  అధికార పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  తన నియోజక వర్గంలో చేయాల్సినఅభివృద్ధి  పనులకు సంబంధించిన  వివరాలను సాక్షాత్తు ముఖ్యమంత్రికి అందజేసినా ఫలితం లేదని సి.ఎం సొంత జిల్లా కు చెందిన ఎం.ఎల్.ఏ ఒకరు తన సన్నిహితుల  వద్ద వాపోయారు.
 శాసన సభ్యుల తీరు ఇలా ఉంటే...  పార్లమెంటు సభ్యులుగా గెలిచిన వారి పరిస్థితి మరింత అగమ్య గోచరం. గతంలో పార్లమెంటు సభ్యులకు ఎం.పి కోటా నిధిలుండేవి. దీంతో వారు చేసిన వాగ్దానాలను అమలు పరిచే వీలుండేది. ప్రధాన మం్రతి నరేంద్ర మోడి ఇటీవలి సంవత్సరాలలో ఎం.పి. నిధులకు కోత విధించారు. దీంతో వారు సొంతంగా అభివృద్ధి పనులు చేయలేని స్థితికి చేరుకున్నారు. అడపా దడపా కేంద్ర మంత్రులను కలవడం, వారికి ఓ విజ్ఞాపన పత్రం అంజేస్తున్నారు.  దీని తాలూకూ ఫోటోను  పార్లమెంట్   నియోజక వర్గ కేంద్రం వద్దకు, పంపి దానిని మీడియాకు అందజేస్తున్నారు. తద్వారా  తాము ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తున్నామని ప్రకటించుకుంటున్నారు. అభివృద్ధి పనుల జాడ మాత్రం ఎక్కడా కాన రావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: