డిసెంబర్ నుంచి వర్క్ ఫ్రం హోం ? 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వర్క్ ఫ్రం హోం ప్రాజెక్టును  డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని  ప్రభుత్వం భావిస్టోంది.  ఈ ప్రాజెక్టు కు అవసరమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆ శాఖ భావిస్తోంది. ఇందుకు అవసరమైన పక్షంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు, వివిధ కార్పోరేట్ రంగ సంస్థల  సాయం కూడా తీసుకోవాలని ఆ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఏపిఐఐసి అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పోరేషన్ అధికారులతో  మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్ణయించినట్లు  రాష్ట్రంలో 29 చో\ట్ల ఈ  ప్రాజెక్టును పైలెట్  ప్రాజేక్టుగా అమలు చేయలని చెప్పారు. వచ్చిన ఫలితాలను ఆధారంగా దీనిని ఆంధ్ర ప్రదేశ్ అంతటా విస్తరించాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పన చేయాలని చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఎదురవుతున్న విద్యత్ కోతలు ఈ  ప్రాజెక్టుకు అడ్డంకి   రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ఈ ఇరవై తొమ్మది కేంద్రాలకు \అవసరమైన బ్రాడ్ బాండ్ ను సమకూర్చాలని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పోరేషన్ అధికారులకు సూచించారు. ఈ పని తక్షణం పూర్తయ్యోలా ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని  ఏఫిఎస్ ఎఫ్ ఎల్  మేనేజింగ్ డైరెక్టర్ ముధుసూదన్ రెడ్డికి  సూచించారు. సమాచార,  పౌర సంబంధాల శాఖ అధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. తాను త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర  ఐ.టి శాఖ మంత్రిని కలుస్తానని, ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తానని చెప్పారు.

ఈ ప్రాజెక్టు అమలు సాధ్యా సాధ్యాలపై ఆ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. ఒక్కో కేంద్రానికి లక్షల్లో వ్యయం అవుతుందని చెప్పారు.  ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాలేదని అన్నారు. వివిధ శాఖలతో సమన్యయం చేసుకోవడం కుదరడం లేదని, ఎవరికి వారు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నరని  పరిశ్రమల శాఖ అధికారులు వాపోయారు.  ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పోరేషన్ గత కొంత కాలంగా కొత్తగా కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. కోట్ల రూపాయల్లో పేరుకు పోయిన బకాయిలను వసులు చేసుకోవడం పైనే ఆ సంస్థ సిబ్బంది దృష్టి  కేంద్రీకరించారు. తాజాగా 29 కేంద్రాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లు ఇవ్వ వలసి రావడం ఆ సంస్థపై అధిక భారం పడే అవకాశం ఉందని అక్కడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ పైలెట్ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: