మొన్నటి వరకు దేశం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఎంతలా అల్లాడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహామారి పంజా విసిరింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను కూడా బలితీసుకుంది  అయితే రెండవ దశ కరోనా వైరస్ ఎంతో విపత్కర పరిస్థితులను తీసుకు వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని జీవితాన్ని గడిపారు. సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితులకు కారణం అయింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతో చివరికి ప్రస్తుతం second వేవ్ కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కాస్త కంట్రోల్ లోనే ఉంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా  వేగంగా కొనసాగింది. ఇక ప్రస్తుతం దాదాపుగా కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ లు తీసుకున్నవారు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు కరోనా వైరస్ అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ముప్పు పొంచివుందని ప్రాణాలు పోతాయని శాస్త్రవేత్తలు ఎంతలా హెచ్చరిస్తునప్పటికీ అందరూ ఇప్పుడు కరోనా వైరస్ ను లైట్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అక్కడక్కడ మళ్లీ  వైరస్ కేసులు పెరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక మరికొంత మంది ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో ఒకవేళ  వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ అది సాధారణ జ్వరమే అంటూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్లక్ష్యంగా వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తీవ్ర కరోనా లక్షణాలతో పదిమంది చేరి ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయి చివరికి ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడింది అంటూ వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గడంతో వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ సాధారణ జ్వరం అని   జనాలు భావిస్తున్నారు అంటూ వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించాయి ఉంటే చాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: