ఏపీలో విప‌క్ష టీడీపీ ప‌రిస్థితి కాస్త ద‌య‌నీయంగానే ఉంది. ఆ పార్టీ నుంచి ఎవ‌రు ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ్లి పోతారో కూడా అర్థం కావ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితు ల‌లో కీల‌క నేత‌లు పార్టీలోకి రావ‌డం కాస్త ఆశ్చ‌ర్య క‌ర‌మే అని చెప్పాలి. ఈ క్ర‌మంలోనే ఏపీ పీసీసీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న‌ యువ కాంగ్రెస్ నేత జీవీరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ మ‌వుతోంది. తాజాగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి ని క‌లిసి పార్టీలో చేరే విష‌య‌మై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఈ నెల 21న టీడీపీలో చేరిక‌కు ముహూర్తం ఖ‌రారైన‌ట్టు కూడా టాక్ ?

ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటూ అంత మంచిది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ క‌నుమ‌రుగై పోవ‌డం కాదు క‌దా.. భూస్థాపితం అయిపోయింది. అయినా కూడా ఆ పార్టీలోనే ఉన్న జీవీ రెడ్డి ఐదేళ్లుగా కొన‌సాగుతూ మీడియాలో బ‌ల‌మైన గొంతుక వినిపిస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌స్తుత రాజ‌కీయాలు, స‌మాజం , ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో చాలా ప‌ట్టు ఉంది.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన వ్య‌క్తి అయిన ఆయ‌న అటు సీఏ గా ఉండి కూడా న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా పొందారు. ప్ర‌స్తుతం 40 సంవ‌త్స‌రాలు అయిన జీవీ రెడ్డి పార్టీలోకి వ‌స్తే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే చంద్ర‌బాబు ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించి న‌ట్టుగా చెపుతున్నారు. ఆయ‌న మీడియా చ‌ర్చ‌ల ద్వారా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతూ టీడీపీ దృష్టిలో ప‌డ్డాడు.

ఇక చంద్ర‌బాబు ఆహ్వానంతో పాటు... ఏపీలో భ‌విష్య‌త్ లేని కాంగ్రెస్‌లో ఉండ‌డం కంటే టీడీపీలో చేర‌డ‌మే స‌ముచి త‌మ‌ని జీవీరెడ్డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక జీవీ రెడ్డి బాట లోనే మ‌రి కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు కూడా టీడీపీ లో చేరేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: