జగన్ ఎప్పుడైతే మంత్రి పదవులు రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటాయని, తర్వాత పాత వాళ్ళని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తానని చెప్పారో...అప్పటినుంచి మొదట్లో పదవులు దక్కనివారు...ఇప్పుడు పదవులు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో 90 శాతం మార్పులు ఖాయమని, కాదు సగం మాత్రమే అని...అసలు అది కాదు 100 శాతం మంత్రివర్గంలో మార్పులు వస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
 
ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 100 శాతం మంత్రివర్గంలో మార్పులు ఖాయమని, అతి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని హింట్ ఇచ్చేశారు. దీంతో పదవులు ఆశించే ఎమ్మెల్యేలు లాబీయింగ్ మొదలుపెట్టేశారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో ఊహించని ట్విస్‌్మలో చోటు చేసుకునేలా ఉన్నాయి....ఖచ్చితంగా  మంత్రి పదవులు దక్కుతాయనే వారికి షాక్ గ్యారెంటీ అని తెలుస్తోంది.


ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పదవులు ఆశించే సీనియర్లకు షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక స్పీకర్ ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు మంత్రులుగా ఉండగా, తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. అయితే నెక్స్ట్ ఇద్దరు మంత్రులు సైడ్ అయిపోతారని తెలుస్తోంది. వారి ప్లేస్‌లో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు రావొచ్చని ప్రచారం జరుగుతుంది. కృష్ణదాస్ ప్లేస్‌లో ప్రసాదరావు, అప్పలరాజు ప్లేస్‌లో స్పీకర్ గా ఉన్న తమ్మినేని వస్తారని ప్రచారం వచ్చింది. స్పీకర్ పదవి మరొకరికి దక్కే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చి పడింది... సీనియర్లకు షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి ప్లేస్‌లో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిల్లో ఎవరోకరికి ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. ఎస్సీ వర్గంలో జోగులు, ఎస్టీ వర్గంలో కళావతి, బీసీ వర్గంలో శాంతిలకు అవకాశాలు రావొచ్చని తెలుస్తోంది. మరి చూడాలి శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ క్యాబినెట్‌లో ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: