ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే తాము మారిపోయామని మహిళలందరికీ సముచిత గౌరవం కల్పిస్తామని.. ప్రజలను హింసించబోము అంటూ మొదట్లో స్టేట్మెంట్ ఇచ్చారు తాలిబన్లు. కానీ ఆ తర్వాత మాత్రం వారి అసలు రంగు బయట పెడుతున్నారు. మరోసారి షరియా చట్టాలు అమలులోకి తీసుకు వచ్చి మహిళలను బానిసలుగా చూస్తున్నారు. అంతేకాదు అక్కడి ప్రజల పట్ల ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు.  ఇక ఇటీవలే తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.


 అయితే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఆధిపత్యాన్ని చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఇక ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అస్సలు అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రమే తాలిబన్లకు మద్దతు  ఇస్తుంది.  ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ దేశాలతో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ అన్ని విధాలుగా కూడా సంక్షోభంలో కూరుకుపోతోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్లో ఆహార సంక్షోభం అయితే రోజురోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి.  ఆఫ్ఘనిస్తాన్  ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేందుకు ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు.


 అక్కడి ప్రజలందరూ ఆహార సంక్షోభం కారణంగా అల్లాడిపోతున్నారు అని చెప్పాలి. ఇక తాలిబన్లకు మద్దతు ఇస్తున్న పాకిస్థాన్లోనే సంక్షోభం ఉండడంతో ఆ దేశం కూడా సహాయం చేయలేని స్థితిలో ఉంది. ఇకపోతే ఆహార సంక్షోభం కారణంగా అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి చావులు మొదలయ్యాయి అన్నది తెలుస్తుంది. వెస్టర్న్ కాబూల్లో హజారా కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆ దేశ మాజీ నేత మహమ్మద్ మహా కిక్ తెలిపారు. తాలిబన్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో దారుణంగా దెబ్బతిన్నాయి అని అన్నారు .   మైనారిటీ కమ్యూనిటీ లైన హజారా, షియాలను  అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలి అంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: