హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అసలే డిపాజిట్లు కోల్పోయి కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మరింత బాధ కలిగించే అంశం.  ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ పార్టీలో ఆసలు కాక మొదలైంది.   పోలింగ్ సరళి పై ఆ పార్టీ సీనియర్ నేతలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. మరికొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే అందరూ కుమ్మక్కు రాజకీయాలను వ్యతిరేకించారు. గాంధీభవన్ లో సమావేశం అనంతరం వెలుగులోకి వచ్చిన లేఖ  సర్వత్రా చర్చనీయాంశమైంది.
 పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన  అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు ఇందులో ఆయన చిత్రాతి చిత్రంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూట కట్టుకున్న నేపథ్యంలో రేవంత్ పై సొంత పార్టీ నేతలే విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ను ఇటీవలే వీడిన  అమరీందర్ సింగ్ తన లేఖలో పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి  పేరు ప్రస్తావించడం సర్వత్ర చర్చనీయాంశమైంది ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎలా  నియమించారని ఆయన తన లేఖలో సోనియా గాంధీని ప్రశ్నించారు తెలంగాణలోనే కాదు మహారాష్ట్రలో   ఇదే పరిస్థితి  నెలకొందని ఆయన చెప్పారు.  భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన నానో పటేల్ మహారాష్ట్ర   పి సి సి అధ్యక్షుడిగా  కొనసాగుతున్నారని అమరీందర్ సింగ్ సోనియాగాంధీ దృష్టికి తీసుకొచ్చారు.
 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపణలు ఇంటాబయటా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాసిన లేఖ  కాంగ్రెస్ పార్టీలో  మరింత కాకను లేపింది. గాంధీభవన్లో సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి పై విరుచుకు పడిన నేపథ్యంలో తాజాగా వెలుగుచూసిన  అమరీందర్ సింగ్ రాసిన లేఖ మరింత ప్రకంపనలు సృష్టించింది ఈ లేఖ గాంధీభవన్ లో జరిగిన సీనియర్ నేతల సమీక్ష సమావేశం అనంతరం వెలుగులోకి రావడం గమనార్హం. ఈ లేఖ లో పేర్కోన్న విషయాలు సమావేశానికన్నా ముందుగా వెలుగులోకి వచ్చి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని  మాజీ పార్లమెంట్ సభ్యుడొకరు తనను కలసిన విలేఖరుల వద్ద వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: