ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కెసిఆర్. అయితే తెలంగాణ ఉద్యమాన్ని తన వాక్చాతుర్యంతో బలమైన సంకల్పంతో ముందుకు నడిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏళ్ల పాటుశ్రమించి ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు అని చెప్పాలి. కెసిఆర్ మీద నమ్మకంతో ఇక తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆయన వెంట నడిచింది. అయితే మిగతా రాజకీయ నాయకుల తో పోల్చి చూస్తే కేసీఆర్ కు ఉండే బలం ఆయన వాక్చాతుర్యం అనే చెప్పాలి. కెసిఆర్ ఎక్కడైనా ప్రసంగాలు ఇచ్చారు అంటే చాలు అక్కడ ఉన్న అందరి మనసులు గెలుచుకుంటారు.



 అంతేకాదు ఇక ప్రత్యర్థులకు తన మాటలతోనే ఊహించని విధంగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు కెసిఆర్. అయితే కెసిఆర్ వాక్చాతుర్యానికి ఆయన రాజకీయ చతురతకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రమే కాదు ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్న కొంతమంది నేతలు సైతం కెసిఆర్ కు అభిమానులుగా కొనసాగుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది ప్రత్యర్థి పార్టీలో ఉన్న సభ్యులు సైతం తాము కెసిఆర్ వాక్చాతుర్యానికి అభిమానులమే అంటూ పలు మార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.



 ఇన్ని రోజుల వరకు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ధర్మపురి అరవింద్ ఇక ఆ తర్వాత టిఆర్ఎస్ లో విభేదాల కారణంగా బిజెపి పార్టీలో చేరారు అన్న విషయం తెలిసిందె. బిజెపి పార్టీలో చేరిన తర్వాత నిజాంబాద్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అప్పట్లో తాను కూడా కెసిఆర్ అభిమానినే అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో  కూటమిగా ఏర్పడాలి అంటూ కోరిన వారిలో తాను కూడా ఉన్నాను అంటూ తెలిపారు. అయితే  ప్రస్తుతం కేంద్రంతో  కెసిఆర్ కు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ చెప్పుకొచ్చారు ధర్మపురి అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: